మోస్ట్ టాలెంటెడ్ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ నటి సమంత హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ శివ నర్వనా దర్శకత్వంలో ఖుషి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... వశిం అబ్దుల్ వాహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , భాషలలో సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభిస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ అదిరిపోయే రేంజ్ లో కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతోంది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమా ధియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన తేదీని కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ మరికొన్ని రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ లేదా కుటుంబరావు అనే టైటిల్ లలో ఏదో ఒక దానిని పెట్టే ఉద్దేశంలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.