యోగి బాబు మ్యానియాలో టాలీవుడ్ !
షారూఖ్ నటిస్తున్న ‘జవాన్’ మూవీలో యోగి బాబుకు ఆమూవీ దర్శకుడు అట్లీ ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసినటట్లు తెలుస్తోంది. ఈమూవీ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే బాలీవుడ్ లో కూడ యోగి బాబు మ్యానియా హడావిడి చేసే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ నుండి తెలుగులోకి డబ్ అవుతున్న అనేక తమిళ సినిమాలలో యోగి బాబు చేసిన కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి వెన్నెల కిషోర్ జబర్దస్త్ కామెడియన్స్ కామెడీ ట్రాక్ తప్ప కొత్త కామెడియన్స్ తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. దీనితో యోగి బాబు కామెడీని తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ చేయడానికి యోగి బాబును తాము తీయబోతున్న మీడియం రేంజ్ సినిమాలలో అతడికి ఒక పాత్రను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు దర్శకులకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు దక్షిణాది సినిమా రంగానికి సంబంధించన కమెడియన్స్ ను బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ గుర్తించిన సందర్భాలు చాల తక్కువ అయితే ఇప్పుడు ‘జవాన్’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బష్టర్ హిట్ అయితే యోగి బాబు పేరు బాలీవుడ్ లో కూడ మారుమ్రోగిపోవడం ఖాయం..