పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది..ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్టు సమాచారం.అయితే ఓజీ మూవీ రిలీజ్ డేట్ గురించి చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‍గా నటిస్తున్నార.ఈ సినిమా నుంచి పవన్ బర్త్డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కనిపించిన ఈ హంగ్రీచీతా వీడియో చూసి పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. యంగ్ డైరెక్టర్ సుజీత్.. పవన్‍ను చూపించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ గ్లింప్స్ వీడియో తో ఓజీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాకు పిచ్చ హైప్ వచ్చింది. అయితే, ఓజీ గ్లింప్స్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు.. ఈ మ్యూజిక్‍తో కూడిన ఓజీ థీమ్ సాంగ్‍ను చిత్ర యూనిట్ నేడు (సెప్టెంబర్ 3) విడుదల చేసింది.'రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా' పేరుతో ఓజీ థీమ్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో థమన్ మ్యూజిక్ అలాగే పవర్ ఫుల్ లిరిక్స్ అదిరిపోయాయి. ఓజి సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా,వైలెంట్‍గా ఉండనుందో ఈ థీమ్ సాంగ్ వింటే తెలుస్తుంది.. గ్లింప్స్‌లోనే ఈ థీమ్ సాంగ్ ఉండగా.. నేడు రిలీజ్ చేసిన ఆడియో వెర్షన్ నిడివి కాస్త ఎక్కువగా ఉంది.ఓజీ నుంచి వచ్చిన ఈ 'రేజ్ ఆఫ్ హంగ్రీ చీతా' సాంగ్.. స్పాటిఫై, జియో సావన్, వింక్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, గానా, యూట్యూబ్ మ్యూజిక్, గానా వంటి పలు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍ల్లోకి వచ్చింది. ఓజీ సినిమా ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది.