తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా పెద్ద పండగే. అలాంటిది ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పాల్సిన పని లేదు.ఇక అలా ఈసారి కూడా పవన్ కళ్యాణ్ బర్త్‌డేను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో ప్రముఖ మాజీ హీరోయిన్, నటి మాధవీ లత కూడా పవర్‌స్టార్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా 'హ్యాపీ బర్త్‌డే టూ యూ మిస్టర్ పవన్ కల్యాణ్. గాడ్ బ్లెస్ యూ' అంటూ ఆమె రాసుకొచ్చింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ క్షణాల్లోనే నెట్టింటా వైరల్‌గా మారింది. ఆమె ఇలా షేర్ చేశారో లేదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బర్త్ డే పోస్ట్‌లో మాధవి 'మిస్టర్ పవన్ కల్యాణ్' అని సంభోదించడమే ఈ ట్రోలింగ్‌కు ప్రధాన కారణం.పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లతో విసుగెత్తిపోయిన మాధవీ లత తిరిగి అదే రేంజ్లో అభిమానులకు కౌంటర్ ఇచ్చారు.
'దీనమ్మ జీవితం.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు కూడా మీరు ఇంత రచ్చ చేస్తున్నారు. మీరు అయితే బాయ్‌ఫ్రెండ్ గారు, మొగుడు గారు ఇంకా తమ్ముడు గారు ఫ్రెండ్ గారు అంటారేమో.. కానీ నేను మాత్రం అలా అనను. నా మనసుకు నచ్చితే ఖచ్చితంగా ఏకవచనంతోనే పిలుస్తాను. ఇక మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం పవన్ కళ్యాణ్ ని అలాగే పిలుస్తాను' అని ఆగ్రహం వ్యక్తం చేసింది మాధవీ లత.అయినా కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆపట్లేదు.ఇక 2008 వ సంవత్సరంలో నచ్చావులే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది మాధవీ లత. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన స్నేహితుడా సినిమాతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉసురు, చూడాలని చెప్పాలని ఇంకా అరవింద్ 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే సినిమాలకు దూరమైన మాధవీ లత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బీజేపీలో చేరి 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ కు తాను పెద్ద అభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది మాధవీలత.