ఇక బిగ్ బాస్ సీజన్ 7 మరింత హుషారుగా స్టార్ట్ అయింది.. ఈ సీజన్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ ఖుషీగా కనిపించారు. ఈ సందర్భంగా నాగార్జున, విజయ్ దేవరకొండ మాటల్లో సమంత ప్రస్తావన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించింది.స్టేజ్‌పై మీ హీరోయిన్ సమంత ఎక్కడ అంటూ నాగ్ అడిగారు.. అందుకు విజయ్ నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. అయితే చైతూ-సమంత విడాకులు తీసుకున్నా.. సామ్ ప్రస్తావన వచ్చినప్పుడు నాగ్ మాట్లాడిన తీరు మాత్రం నిజంగా చాలా హుందాగా ఉంది. అయితే ఇప్పుడు ఇంకో విషయం గురించి కూడా చర్చ జరుగుతోంది. అదే సమంత హెల్త్.. ఆమె హెల్త్ ఇంకా సెట్ కాలేదా? అని కొంతమంది అంటుంటే.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నాగార్జునకు తెలియదా? వాళ్లు టచ్‌లో లేరా? అని మరికొందరు అంటున్నారు. ఇక విజయ్‌కీ, సమంతకీ మధ్య నటన పోటీపోటీగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, సమంతను మంచి నటి అని కూడా మెచ్చుకున్నారు నాగార్జున. ఇలా ప్రొఫెషనల్‌గా ఆమెకు నాగ్ ఇచ్చిన కాంప్లిమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సమంత ఫ్యాన్స్.
ఇలా సమంతని నాగ్ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం పై నెటిజన్స్ చాలా ప్రశంసిస్తున్నారు.విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడురోజుల్లో మొత్తం రూ. 70 కోట్ల వసూళ్లు చేసినట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇంకా శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించిన ఈ మూవీకి హృదయం ఫేమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చారు. అలాగే ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఖుషి రిలీజయ్యింది.