త్రివిక్రమ్ రాయబారానికి స్పందన లేని మహేష్ ?
ఈసాన్నిహిత్యం వల్లనే త్రివిక్రమ్ సలహాతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ సినిమాలను ఆసినిమాల దర్శకుల గురించి పట్టించుకోకుండా కేవలం త్రివిక్రమ్ చెప్పిన మాట పై నమ్మకం ఉంచి నటించాడు అని అంటారు. లేటెస్ట్ గా పవన్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ దర్శకుడు సుజిత్ ఫ్లాప్ లలో ఉన్నప్పటికీ కేవలం త్రివిక్రమ్ చేసిన రాయబారంతో ఆమూవీలో ప్రస్తుతం పవన్ నటిస్తున్నాడు అన్నవార్తలు కూడ ఉన్నాయి.
లేటెస్ట్ గా విడుదలైన ‘ఓజీ’ మూవీ టీజర్ ఈమూవీ పై మరింత అంచనాలు పెంచాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈమూవీని నిర్మిస్తున్న నేపధ్యంలో ఈమూవీని భారీ బడ్జెట్ మూవీగా తీసి అత్యంత భారీ బిజినెస్ చేయాలి అన్నటార్గెట్ తో ఈమూవీ దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీ క్రేజ్ ను మరింత పెంచడానికి దర్శకుడు సుజిత్ వేసిన మాష్టర్ ప్లాన్ కు త్రివిక్రమ్ సహకారం లభించినప్పటికీ దానికి సూపర్ స్టార్ సహకారం లభించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో క్రియేట్ చేసిన ఒక అతిధి పాత్రను మహేష్ చేత నటింప చేస్తే ఈమూవీకి మరింత క్రేజ్ పెరిగి మార్కెట్ బాగా జరుగుతుందన్న ఆలోచనలతో సుజిత్ తన ఆలోచనలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారం తీసుకుని ఈవిషయమై త్రివిక్రమ్ తో మహేష్ వద్దకు రాయబరాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మహేష్ త్రివిక్రమ్ రాయబారానికి స్పందించలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈగాసిప్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది..