షాకింగ్ మెగా హీరోలతో 100 కోట్ల లాస్ ?
కేవలం రెండు నెలల గ్యాప్ లో మెగా హీరోలు పవన్ కళ్యాణ్ చిరంజీవి వరుణ్ తేజ సినిమాలు మూడు వరసగా విడుదల అయినప్పటికీ ఆమూడు సినిమాలు ఆశించిన స్థాయిలో కలక్షన్స్ రాబట్టలేక పోవడంతో ఈమూడు సినిమాల బయ్యర్లకు 100 కోట్ల నష్టం వచ్చింది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీకి దర్శకత్వం వహించింది సముద్రఖని అయినప్పటికీ ఆసినిమాకు కర్త కర్మ క్రియగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరించినప్పటికీ ఆమూవీ అనుకున్న విజయాన్ని సాధించలేదు.
ఇక ఈమూవీ తరువాత రెండు వారాల గ్యాప్ తో విడుదలైన చిరంజీవి ‘భోళాశంకర్’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ బయ్యర్లకు అత్యంత భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి అన్నప్రచారం ఉంది. వాస్తవానికి ఈసినిమాను మెగా అభిమానులు కూడ భరించ లేకపోయారంటే ఈమూవీ ఎలాంటి ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుందో అర్థం అవుతుంది.
ఈరెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో వరుణ్ తేజ్ నటించిన ‘గాండివధారి అర్జున’ మూవీ అయినా హిట్ అవుతుందని మెగా అభిమానులు భావించారు. అయితే ఈసినిమా కూడ ఫ్లాప్ గా మారింది. దీనితో జూలై ఆగష్టు నెలలు మెగా ఫ్యామిలీ హీరోలకు కలిసిరాలేదు అంటూ మెగా అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ‘బ్రో’ మూవీని ఓటీటీ లో బాగా చూసిన ఓటీటీ ప్రేక్షకులు ‘భోళాశంకర్’ ను ఓటీటీ లో కూడ భరించలేకపోతున్నారు అన్నకామెంట్స్ ఉన్నాయి.
ఈపరిస్థితులు ఇలా ఉంటే మెగా అభిమానులకు జోష్ ను కలిగించే మెగా హీరోల సినిమాలు ఇప్పట్లో విడుదల అయ్యే ఆస్కారం కనిపించడం లేదు. చిరంజీవి ‘భోళాశంకర్’ షాక్ తో తన కొత్త సినిమా షూటింగ్ ను ఎప్పుడు మొదలుపెడతారో క్లారిటీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఎన్నికల హడావిడి ప్రారంభం అవుతున్న పరిస్థితులలో వచ్చే సమ్మర్ వరకు ‘ఓజీ’ విడుదల అయ్యే ఆస్కారం లేదు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పరిస్థితి కూడ ఇలాగే ఉంది..