మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఒకపక్క సినిమాలో నటిస్తూనే మరో పక్క జనసేన నాయకుడిగా రాజకీయాల్లో సైతం పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుండి కూడా నాయకుడిగా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి ఆయన. ఇక ఆయన మనసుకు ఏది అనిపిస్తే అదే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఆయనది. ముఖ్యంగా తన అన్న చిరంజీవి గురించి కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎవరైనా విమర్శిస్తే చాలు నిర్మొహమాటంగా వాళ్ళని ఏకీపారేస్తూ ఉంటారు. ఇక నాగబాబు పిల్లల విషయంలో ఈ మధ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక నాగబాబుకి వరుణ్ తేజ్ మరియు నిహారిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిహారిక ఈ మధ్యనే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇక వరుణ్ ఇప్పుడే పెళ్లికి రెడీ అయ్యాడు. జూన్ తో వరుణ్ తేజ్ మరియు టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ కూడా జరిపారు. త్వరలోనే వారిద్దరికీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసే పనిలో మెగా కుటుంబం ఉంది అని అంటున్నారు. అయితే ఆగస్టులోనే విడుదల పెళ్లి జరగాల్సి ఉంది . కానీ కొన్ని కారణాలవల్ల ఆగస్టు నుండి నవంబర్ లో వీరిద్దరి పెళ్లి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాము అని వరుణ్ తేజ్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
అయితే గత నెల గాండీవ దారి అర్జునా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో సినిమాలకి గ్యాప్ ఇచ్చి తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు ట్రిప్ వేసింది కేవలం వెకేషన్ కోసం కాదు అని వరుణ్ మరియు లావణ్య పెళ్లి పనులు కోసమని అందుకే కుటుంబం మొత్తం విదేశాలకు పయనమైనట్లుగా తెలుస్తోంది .దీంతో ఈ వార్తలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి..!!