ఒక్కో చిత్రానికి అనుష్క తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
సౌత్ ఇండియా లో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి.. అరుంధతి, రుద్రమదేవి తదితర చిత్రాలలో లేడీ ఓరియంటెడ్ గా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. తన కెరియర్లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పార్టీ అందుకున్న అనుష్క ఎంతోమంది హీరోయిన్లకు సైతం స్ఫూర్తిగా నిలిచింది.. కెరియర్ మొదటి నుంచి ఈమె గ్లామర్ రూల్స్ లో ఉండే పాత్రల కంటే కంటెంట్ ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన అనుష్క మళ్లీ తన హవా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.

అనుష్క తన స్టార్ట్ హవని పక్కన పెట్టి నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మరి సినిమాకి తగ్గట్టుగానే బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని పారితోషకాన్ని తీసుకున్నందుకు సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమా పెద్దదా చిన్నదా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె చాలా గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమాకు గాని ఈమె రూ .6కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకున్నట్లు సమాచారం.

అయితే అనుష్క ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలలో కూడా నటిస్తున్నది. కానీ అవి తెలుగులో కాదు మలయాళంలో చేస్తున్నది హర్రర్ చిత్రాలు పీరియాడికల్ చిత్రాలలో నటిస్తోంది అనుష్క శెట్టి. అనుష్క మలయాళ చిత్రాలను కొన్ని నెలల క్రితం ఒప్పుకున్నది.. అయితే ఈ చిత్రాలకు అనుష్క  రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే తీసుకున్నది.. రూ 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కంటే తక్కువగా తీసుకున్నదని సమాచారం.. దీన్నిబట్టి ఆమె కంటెంట్ ఉన్న చిన్న సినిమాలైనా సరే రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరి నటించేందుకు ఆసక్తి చూపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎన్ని చిత్రాలలో నటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: