ప్రమాదపు అంచున టాలీవుడ్ !

Seetha Sailaja
గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణం జరపుపుకుంటున్న సినిమాల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగింది. 5 కోట్లు పారితోషికం తీసుకునే మీడియం రేంజ్ హీరోలు 15 కోట్ల స్థాయికి ఎదిగిపోయారు. 40 కోట్ల పారితోషికం తీసుకునే టాప్ హీరోలు 75 కోట్ల స్థాయికి ఎదిగిపోయారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు టాప్ హీరోలు అయితే 100 కోట్ల స్థాయిలో కూడ కొనసాగుతున్నారు.


చాలామంది టాప్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి వస్తున్న గ్రాస్ కలక్షన్స్ ను ఆధారంగా తీసుకుని భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చాలమంది టాప్ హీరోలు నటించిన భారీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ వారి పారితోషికాలను ఏమాత్రం తగ్గించుకునే స్థాయిలో లేరు అన్నవార్తలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో చాలమంది నిర్మాతలు ఓటీటీ శాటిలైట్ మార్కెట్ ను నమ్ముకుని ఇప్పటివరకు మీడియం రేంజ్ మరియు టాప్ హీరోలకు వారు డిమాండ్ చేసిన స్థాయిలో పారితోషికాలు ఇస్తూ వచ్చారు అన్నకామెంట్స్ ఉన్నాయి. అయితే ఇక రానున్న రోజులలో ఆపరిస్థితులు ఉండకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికికారణం ఓటీటీ సంస్థలు అదేవిధంగా ఛానల్స్ సినిమాలను కొనుగోలు చేసే విషయంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అన్నకామెంట్స్ వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ సినిమాలను కొనే విషయంలో క్రితంలా నిర్మాతల వెంట పడటం లేదు అన్నవార్తలు వస్తున్నాయి. దీనివల్ల ఓటీటీ సంస్థలు టాప్ హీరోల సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు ఓటీటీ సంస్థలు ఆఫర్ చేసే ఆఫర్స్ లో భారీ కోతలు ఏర్పడుతున్నాయని దీనివల్ల క్రితంలా నిర్మాతలు టాప్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు డిమాండ్ చేసే భారీ స్థాయి పారితోషికాలను ఇక భవిష్యత్ లో ఇవ్వలేకపోవచ్చు అన్నకామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండా హీరోలు తమ పారితోషికాల విషయంలో మొండిపట్టును కొనసాగిస్తారా లేదంటే వాస్తవ దృష్టితో ఆలోచిస్తారా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: