సాధారణంగా ఒక సినిమాలో
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే వారిని రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు సినీ లవర్స్. కొన్నిసార్లు మరీ ముందుకు వెళ్లి ఆ జంట బయటపెల్లి చేసుకుంటే ఎంత బాగుంటుందా అని కూడా అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక అలా వారికి సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు వారి అభిమానులు. ఇక అలాంటి
హీరో హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జంట ఎవరైనా ఉన్నారు అంటే అది
రష్మిక మందన
విజయ్ దేవరకొండ. గీతాగోవిందం
డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరిద్దరూ గీతాగోవిందం
సినిమా నుండి ప్రేమాయణం నడుపుతున్నారు అన్న కథనాలు వినిపించాయి.
ఆ తర్వాత ఆ విషయాలన్నీ నిజమే అన్నట్టుగా వారిద్దరూ తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా మరియు
ముంబై ఎయిర్పోర్ట్లో వీరిద్దరూ కనిపించడం ద్వారా నిజమే అని చాలా వరకు నమ్మారు. దాంతోపాటు మాల్దీవ్స్లో సైతం
రష్మిక విజయ్ దేవరకొండ ఫోటోలు ఒకే సమయంలో బయటకు రావడం ద్వారా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అని ప్రేక్షకులు నిర్ధారించారు .దానికి తగ్గట్టు ఈ జంట చేసే పనులు ఆ వార్తలను నిజం చేస్తున్నాయి. ఇక అలా వారు తమకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ఎలాంటివారికైనా వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అని స్పష్టమయ్యేలా ఆ ఫోటోలు ఉంటాయి .
ప్రస్తుతం ఇప్పుడు అలాంటి సంఘటనే మళ్లీ చోటుచేసుకుంది. సాధారణంగా సెలబ్రిటీలను జనాలు ఎప్పుడు క్లోజ్ గా పరిశీలించరు. అలానే ఇప్పుడు
రష్మిక విషయంలో చేసి
రష్మిక మందన తన బాయ్ఫ్రెండ్
విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల
రష్మిక అసిస్టెంట్ వివాహం హైదరాబాదులో జరిగింది. అందుకు పసుపు రంగు చీరలో వచ్చింది రష్మిక. ఇక పెళ్లికి వచ్చిన ఆమె తన బాయ్ ఫ్రెండ్
విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళింది ఎలా అని అనుకుంటున్నారా
రష్మిక ఒక ఫోటో షేర్ చేసింది .ఇక ఆ ఫోటోలో ఉన్న పిట్టగోడ ఆధారంగా ఈ విషయాన్ని కనిపెట్టేసారు .విజయ దిగిన ఒక ఫోటోలో బ్యాగ్రౌండ్ లో ఉన్న పిట్టగూడా
రష్మిక దిగిన ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రెండు ఒకటే. దీంతో
విజయ్ దేవరకొండ ఇల్లు అని కన్ఫామ్ చేసేసారు..!!