కిరాక్ పోజులతో మెగా ఇంటి కోడలు...!!

murali krishna
కొద్దిరోజుల్లో నిహారిక మెగా కోడలు కానుంది. ఈ క్రమంలో సినిమాలు దూరమయ్యారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన లావణ్య అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది.లావణ్య సీరియల్ నటి కాగా ఆమెను దర్శకుడు హను రాఘవపూడి హీరోయిన్ చేశాడు. అందాల రాక్షసి ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. కమర్షియల్ గా ఆడకున్నా... లావణ్యకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం విష్ణుకు జంటగా నటించిన దూసుకెళ్తా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.బ్లాక్ బస్టర్ మూవీ మనం లో క్యామియో రోల్ చేసిన లావణ్యకు వరుసనే రెండు హిట్స్ పడ్డాయి. నానికి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్. దర్శకుడు మారుతి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా మూవీతో మరో హిట్ కొట్టింది. దాంతో లావణ్యకు ఆఫర్స్ క్యూ కట్టాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ లావణ్య త్వర ఫేడ్ అవుట్ అయ్యింది. కేవలం పదేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అయితే మెగా ఫ్యామిలీ కోడలిగా వార్తల్లో నిలిచింది. లావణ్య వరుణ్ తేజ్ భార్య కానుంది.

జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ నాగబాబు నివాసంలో జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. దాంతో ఎక్కడో ఓ మూలన సందేహాలు ఏర్పడ్డాయి.నవంబర్ నెలలో లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. లావణ్య యాక్టింగ్ కి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: