చదువు నాశనం అవ్వడానికి కారణం ఆ అమ్మాయే అంటున్న ధనుష్....!!
తనకున్న ఈ ఎఫైర్ల వచ్చే రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య కూడా ఇద్దరు కొడుకులను తీసుకుని విడాకులు ఇచ్చి దూరంగా పెట్టిందని తెలుస్తోంది. ఇదంటా ఇలా ఉంటే ధనుష్ సినిమాల్లోకి రాకముందు నుంచే అమ్మాయిల వెంట పడేవాడట. అయితే సార్ ప్రమోషన్ల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ధనుష్ పాల్గొన్నారు. ఆ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చిన్నప్పుడు పదో తరగతి వరకు చాలాబాగా చదివేవాడట. అంతే కాదు క్లాస్ లో ఫస్ట్ తానే వచ్చేవాడట.కానీ టెన్త్ ఆయిపోయి ఇంటర్లోకి అడుగు పెట్టాక చదువు అంతా పాడైపోయిందట. దానికి ఓ అమ్మాయే ప్రధాన కారణం అట. ఇంటర్లో ఓ అమ్మాయి ప్రేమలో పడి చదువును దూరంగా పెట్టేశాడట. తనతో రోజంతా ఫోన్లో చాటింగ్లు, మాటలతోనే గడిపేవాడట. దాంతో చదువు నాశనం అయిపోయిందట. కానీ ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.