సుధీర్ బాబు "మామా మ‌శ్చీంద్ర" మూవీ విడుదల తేదీన ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు కొంత కాలం క్రితమే హంట్ అనే సినిమాలో హీరోగా నటించారు. ఈ మూవీ లో ఇతను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో బాగానే అలరించినప్పటికీ ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు మామా మ‌శ్చీంద్ర అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందుతోన్న ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ కి న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈషా రెబ్బా , మృణాళిని ర‌వి ఈ మూవీ లో హీరోయిన్ లుగా న‌టిస్తోన్నారు. సునీల్ నారంగ్‌ , పుస్కూర్ రామ్‌ మోహ‌న్ రావు నిర్మిస్తోన్న ఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ ని అందిస్తోన్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
 


ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. అలాగే అందుకు సంబంధించిన పోస్టర్ లను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. మరి ఈ సినిమాతో సుదీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో తెలియాలి అంటే అక్టోబర్ 6 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: