టాలీవుడ్
కింగ్ అక్కినేని
నాగార్జున పోయిన సంవత్సరం
దసరా కానుకగా విడుదల అయినటువంటి ది ఘోస్ట్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో
నాగార్జున సరసన మోస్ట్ హాటెస్ట్
బ్యూటీ సోనాల్ చౌహాన్
హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్
డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో చివరగా ఈ
సినిమా యావరేజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
ఇకపోతే ది ఘోస్ట్
మూవీ విడుదల అయిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న
నాగార్జున కొంత కాలం క్రితమే నా సామి రంగ అనే
మూవీ లో
హీరో గా నటించబోతున్నట్లు ప్రకటించాడు. ఇకపోతే ఈ
సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ
మూవీ లో
నాగార్జున సరసన నటించబోయే
హీరోయిన్ కోసం చిత్ర బృందం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా
అషిక రంగనాథ్ ,
మానస వారణాసి ఇద్దరిని కూడా తాజాగా టెస్ట్ లుక్ చేసినట్లు అందులో ఎవరు అయితే చిత్ర బృందాన్ని బాగా ఇంప్రెస్ చేస్తారో వారినే ఈ సినిమాలో
హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే నా సామి రంగా
సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది. ఈ సినిమాలో
నాగార్జున అదిరిపోయే ఊర
మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ
సినిమా నాగార్జున కెరియర్ లో 99 వ
మూవీ గా రూపొందబోతుంది.