మార్క్ ఆంటోనీ సినిమాలో అందుకే సిల్క్ స్మిత ను పెట్టాము.. హీరో విశాల్..!?

Anilkumar
విశాల్ హీరోగా నటిస్తున్న సరికొత్త సినిమా మార్క్ ఆంటోనీ. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది . ఇందులో సిల్క్ స్మిత ను చూపించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంపై తాజాగా విశాల్ స్పందించడం జరిగింది. ప్రేక్షకు ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ పాత్ర క్రియేట్ చేసాము అని.. అంతేకానీ ఆ పాత్రను ఎక్కడా కూడా తప్పుగా చూపించాలి అన్నది మా ఉద్దేశం కాదు అని.. పేర్కొన్నాడు.


ఇక విషయాలని నటుడిని రీప్లేస్ చేయడం సాధ్యమే కానీ సిల్క్ స్మితను రీప్లేస్ చేయడం ఎవరి తరం కాదు.. ఆమె ఒక సినిమాకి గ్లామర్ అందించడమే కాదు అద్భుతంగా నటించేవారు కూడా.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆమె ఇక ఆమె స్టార్ గా కొనసాగిన సమయంలో తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమె డాన్స్ ఉండేలా చూసుకునే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.. 350 రోజుల్లో నటించిన ఆమె అనుకోని విధంగా జీవితాన్ని ముగించారు..


మార్క్ అంటోనిలో సిల్క్ స్మిత పాత్ర దాదాపుగా నాలుగు నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఆ పాత్రను సోషల్ మీడియా స్టార్ విష్ణు ప్రియ తో చేయించాను.. కేవలం ఆ ఒక్క పోర్షన్ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇక అది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని మేమందరము భావిస్తున్నాము.. అంటూ ఈ విషయంపై తాజాగా స్పందించాడు హీరో విశాల్. ఇక గ్యాంగ్స్టర్ టైం ట్రావెల్ నేపద్యంలో వస్తున్న ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. రీతు వర్మ అభినయ కథానాయకులుగా ఇందులో కనిపించబోతున్నారు. సునీల్ ఎస్ జె సూర్య సెల్వరాఘవన్ వంటి వారు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: