సలార్ చుట్టూ పెరిగిపోతున్న చిక్కుముడులు !
జరుగుతున్న ఈ పరిణామాల పై ప్రభాస్ నుండి కూడ ఎటువంటి స్పందన లేకపోవడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ విడుదల తేదీ వాయిదా పడటంతో ఈమూవీని ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయమై మూవీ నిర్మాతలు జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు అనిపించడం లేదు అని అంటున్నారు. ఈసినిమాను నవంబర్ లో విడుదల చేద్దాము అంటే అప్పటికి దీపావళి కూడ అయిపోతుంది కాబట్టి ఆ డేట్ పట్ట ఈమూవీ బయ్యర్లు ఆశక్తి కనపరచడం లేదు అని అంటున్నారు.
ఇక డిసెంబర్ విషయానికి వస్తే ఆ నెల అంతా ఇప్పటికే అనేక సినిమాల రిలీజ్ డేట్స్ తో ప్యాక్ అయిపోవడంతో ‘సలార్’ కు సరైన డేట్ దొరకడం లేదు అని టాక్. దీనితో సంక్రాంతి కొరకు ఆలోచిస్తుంటే ఇప్పటికే ‘గుంటూరు కారం’ ‘ఈగల్’ నాగార్జున ‘నాసామిరంగ’ విజయ్ దేవరకొండ పరుశు రామ్ ల లేటెస్ట్ మూవీ ఇలా అనేక సినిమాలు సంక్రాంతి వైపు చూస్తూ ఉండటంతో ‘సలార్’ కు అక్కడ కూడ ప్లేస్ దొరకడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దీనితో ‘సలార్’ ఎప్పుడు విడుదల చేయాలో ఆమూవీ నిర్మాతలకు కూడ తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. ఆమధ్య జూన్ లో ‘సలార్’ కు సంబంధించి వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఈమూవీ నిర్మాతలు ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు అంటూ ప్రభాస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..