బాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్. ఈ రోజు నార్త్ మొత్తం జవాన్ మూవీ మేనియాతో ఒక రేంజ్ లో ఊగిపోతోంది అంటే రిలీజ్ కి ముందు జవాన్ సినిమా క్రియేట్ చేసిన హైప్ అసలు ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు.వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని జవాన్ సినిమాతో షారుఖ్ ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని నిజం చేస్తూ జవాన్ సినిమా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ నుంచి కూడా బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రతి క్రిటిక్ 3.5 నుంచి 4 దాకా రేటింగ్ ఇస్తున్నారు అంటే జవాన్ సినిమా పఠాన్ ని మించి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉంది. రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేసిన జవాన్ మూవీ… ఏకంగా 5 లక్షల ప్రీబుకింగ్స్ ని రాబట్టింది. దీంతో కేవలం బుకింగ్స్ నుంచే 70 కోట్ల రూపాయల కలెక్షన్స్ డే 1 కన్ఫర్మ్ చేసుకుంది జవాన్ సినిమా.బుక్ మై షో యాప్ లో అయితే బుకింగ్స్ ఇంకా అవుతున్నాయి. ఇప్పటికే 1.1 మిలియన్ పైగా బుకింగ్స్ అయ్యాయి. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఆల్ టైం రికార్డ్.
జవాన్ సినిమా ఓవరాల్ గా డే 1 వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం పక్కా అని బీటౌన్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల ఓపెనినింగ్ రాబట్టిన బాలీవుడ్ హీరోగా షారుఖ్ ఖాన్ ఖచ్చితంగా హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఇది మాత్రమే కాదు ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా కూడా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు.సరిగ్గా ఎనిమిది నెలల క్రితం దాకా షారుఖ్ అనే పేరుకి కూడా ఇండస్ట్రీలో టైమ్ అయిపొయింది అనే మాటలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే ఆయన టైమ్ ఎప్పటికీ అయిపోదు, ఆయన ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించే రేంజులో జవాన్ సినిమా హల్చల్ చేస్తోంది.ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే జవాన్ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల మార్కెట్ ని ఈజీగా టచ్ చేస్తుంది. అక్టోబర్ 19 దాకా జవాన్ సినిమాకి సౌత్ నుంచి వచ్చే కష్టం లేదు, నార్త్ లో అసలు జవాన్ కి పోటీనే లేదు కాబట్టి జవాన్ ఫైనల్ కలెక్షన్స్ ముందెన్నడూ చూడని విధంగా వస్తాయి.