టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.అయితే టాక్ పరంగా ఒకే కానీ చాలా ఏరియాలలో మాత్రం ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసింది. ఇక రేపటి నుంచి వచ్చే వసూళ్లు లాభాల కిందకి వస్తాయి.విజయ్ దేవరకొండ, సమంతలకు తమిళ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండటం వల్లే ఈ రేంజ్ కలెక్షన్లు సొంతమయ్యాయని సమాచారం అందుతోంది. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు, తమిళ వెర్షన్లు ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ఊహించని స్థాయిలో చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయింది.. ఖుషి సినిమా టాక్ పరంగా మెప్పించినా కమర్షియల్ గా వర్క్ ఔట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఈ సినిమా వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్ అవుతున్నాయి. నైజాంలో హైదరాబాద్ తప్ప మిగిలిన ఏరియాలో ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇక ఆంధ్రాలో అయితే మరీ దారుణం.ఖచ్చితంగా ఇంకా 16 కోట్లు వస్తే తప్ప దాదాపు అది కష్టమే అని చెప్పాలి.జవాన్ సినిమా రిలీజ్ అయ్యి అల్ ఇండియా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక జవాన్ సునామిలో ఖచ్చితంగా ఈ ఖుషి కొట్టుకుపోవడం ఖాయం. మరి చూడాలి విజయ్ లక్ ఎలా ఉంటుందో..