డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎమోషనల్ కామెంట్స్..!!
అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ కు చిన్నాన కూడా అవుతారట. నీలకంఠాపురం పాఠశాలలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రశాంత్ నీల్ పాల్గొనడం జరిగింది. తన చిన్నాన రఘువీరారెడ్డి తో పాల్గొన్న ఈయన అక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. అనంతరం నీలకంఠాపురం గ్రామంలో నిర్వహించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ ను చూసేందుకు గ్రామ ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే ఈ సందర్భంగా ప్రశాంత నీల్ మాట్లాడుతూ సినిమాలలో తాను ఎంత గొప్ప వాడినయినప్పటికీ కూడా నా మరణాంతరం నీలకంఠాపురంలోని తన తండ్రి సమాధి పక్కన తన సమాధి కూడా ఉంటుంది అంటూ తెలిపారు.. మా నాన్న జయంతి ఇదే రోజు కావడం చాలా సంతోషంగా ఉందని ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాని ప్రారంభించబోతున్నారు ప్రశాంత్ నీల్.. తన తండ్రి పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.