చంద్రముఖి 2 ని తిరస్కరించిన సాయి పల్లవి ?
ఈసినిమాకు సీక్వెల్ గా వెంకటేష్ ‘నాగవల్లి’ గా తీసినప్పటికీ ఆసినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు పి. వాసు లారెన్స్ ను హీరోగా చేసి ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ తో తీసిన ‘చంద్రముఖి 2’ ఈనెలలో వినాయకచవితి పండుగకు ముందు విడుదల కాబోతోంది. వాస్తవానికి దర్శకుడు పి. వాసు ఈమూవీ సీక్వెల్ ను రజనీకాంత్ తో తీయాలని చాల గట్టి ప్రయత్నాలు చేశాడు అని అంటారు.
అయితే రజనీకాంత్ కు ఈ సీక్వెల్ కథ నచ్చక పోవడంతో అతడి స్థానంలో లారెన్స్ వచ్చి చేరాడు అన్నవార్తలు కూడ ఉన్నాయి. వాస్తవానికి ఈ సీక్వెల్ లో సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకోవాలని వాసు చాలగట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తిరస్కరించడంతో ఆపాత్రకు కంగనా రనౌత్ వచ్చి చేరింది అన్నవార్తలు ఉన్నాయి. వాస్తవానికి కంగనా రనౌత్ క్లాసికల్ డాన్సర్ కాదు.
ఆపాత్ర సాయి పల్లవి అన్నివిధాల సరిపోతుందని పి. వాసు ఎంత ఒత్తిడి చేసినా సాయి పల్లవి తిరస్కరించింది అని అంటారు. దీనితో సాయి పల్లవి పి. వాసు చెప్పిన ఈసీక్వెల్ కథను ఎందుకు తిరస్కరించింది అంటూ కాలీవుడ్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా సాయి పల్లవి కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. దీనితో ఈసీక్వెల్ కథ నచ్చక ఆమె తిరస్కరించిందా లేదంటే ‘చంద్రముఖి 2’ సీక్వెల్ లో నటించినా ప్రయోజనం ఉండదా అన్న ఆలోచనలు ఆమె చేసి ఉండవచ్చు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..