కంగానా గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జ్యోతిక....!!

murali krishna
సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతారా ప్రధాన పాత్రలలో నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను దర్శకుడు పి. వాసు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.దాదాపు 18 ఏళ్ల క్రితం అద్భుత విజయం సాధించిన చంద్రముఖి సినిమా కు  సీక్వెల్ గా చంద్రముఖి2 మూవీ తెరకెక్కింది.ఈ సినిమాను కూడా దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు.రజనీకాంత్ సీక్వెల్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. ఈ సినిమాను ను రాఘవ లారెన్స్ చేస్తున్నాడు హర్రర్ సినిమాలకు బ్రాండ్ గా మారిన రాఘవ.. ఆ ఎక్స్ పీరియన్స్ తో ఈసినిమాను అద్భుతంగా చేస్తాడన్న నమ్మకం ఆడియన్స్ లో కలిగింది.ఇక ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ నటించింది.సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చంద్రముఖి 2 రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 


వినాయక చవితి శుభాకాంక్షలతో.. సెప్టెంబర్ 15న విడుదలకు కు రెడీ అవుతోంది మూవీ. దీనితో చిత్ర ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి.. ఇక ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. తాజాగా ఈసినిమా గురించి అలాగే కంగనా నటన గురించి.. మాజీ చంద్రముఖి జ్యోతిక ఆసక్తి కర కామెంట్స్ చేశారు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమ గొప్ప నటుల్లో కంగనా రనౌత్ ఒకరు ఆమె చంద్రముఖి పాత్రను పోషించడం ఎంతో గర్వంగా ఉందని జ్యోతిక పోస్ట్ చేశారు.చంద్రముఖి లుక్‌లో ఆమె అద్భుతంగా ఉన్నారని, ఆమె నటనకు తాను అభిమానిని అని చెప్పారు.ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, రాఘవ లారెన్స్ మాస్టర్, పీ వాసు సర్ ఆల్ ది బెస్ట్.. మీకు విజయం దక్కాలని కోరుకుంటున్నానని పోస్ట్‌లో పేర్కొన్నారు.అలాగే చంద్రముఖి-2 చిత్ర బృందానికి జ్యోతిక శుభాకాంక్షలు తెలిపారు.

 
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇక ఇదే విధంగా గతంలో జ్యోతిక నటన గురించి కూడా కంగనా రనౌత్  కూడా కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా రనౌత్.. చంద్రముఖి సినిమాలో నటి జ్యోతిక నటన సాటిలేదని ఆమెకు ధీటుగా నటించడం తనకే కాదు ఇంకెవరికీ  కూడా సాధ్యం కాదని కంగన తెలిపారు.. చంద్రముఖిగా జ్యోతిక అద్భుతంగా నటించారని, ఆ స్థాయికి తన నటన ఉండదని కూడా ఆమె తెలిపింది.ప్రస్తుతం చంద్రముఖి 2 సీక్వెల్  విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: