కొత్త కారు కొన్న రకుల్.. ధర ఎంతో తెలిస్తే షాక్?

praveen
సినీ సెలెబ్రేటిలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన విషయం ఏది ఇంటర్నెట్లోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే సినిమా అప్డేట్లకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు అటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి కూడా అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక సినీ సెలబ్రిటీలు వాడే కార్లు ఉండే భవనాలు ఉపయోగించే వస్తువులు ఎంత ఖరీదైనవో అన్న విషయం కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు  అయితే ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే తమకు ఇష్టమైన కొత్త కారులను కొనుగోలు చేయడం చేస్తూ ఉన్నారు.


 ఏకంగా ఇష్టమైన కారును కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఇలాగే ఒక కాస్లీ కారుని కొనుగోలు చేసింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎస్యుబి మెర్సరీస్ బెంజ్ జిఎల్ఎస్ మే బ్యాగ్ కి యజమాని అయింది ఈ హాట్ హీరోయిన్. ఇక ఈ కారు కొనుగోలు చేసేందుకు 2. 92 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.


 కాగా ఇటీవల తన కొత్త కారులో ముంబై వీధుల్లో షికార్లు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక రకుల్ కెరియర్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే కాస్త నెమ్మదించింది అని చెప్పాలి. గతంలో సౌత్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన రకుల్.. ఇక ఇప్పుడు అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకుంటుంది  ఇక బాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పాలి. ఇక త్వరలో ఆమె అయలన్ అనే తమిళ చిత్రంలో కనిపించబోతుంది. సైన్స్ ఫిక్షన్ చిత్రంలో శివ కార్తికేయన్ ప్రథమ పాత్రలో కనిపించనుండగా   ఈ హీరో తో రొమాన్స్ చేయబోతుంది రకుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: