ఈరోజు క్రేజీ తెలుగు మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , బాలకృష్ణ ,  వెంకటేష్  నాని , విజయ్ దేవరకొండ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ మూవీ లు ఏమిటి ..? వాటి షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం వారు పవన్ కళ్యాణ్ పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు .

బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం బాలకృష్ణ మరియు ఇతరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం వెంకటేష్ మరియు కొంత మంది ఇతరులపై శ్రీలంక లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఊటీ లో నాని , మృణాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు  ప్రస్తుతం ఈ మూవీ బృందం విజయ్ దేవరకొండ పై సాంగ్ ను చిత్రీకరిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: