చిరంజీవి కంటే ముందు.. సురేఖను ఆ స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారా?
ఆ దేవుడే వీరిద్దరి జోడిని కలిపాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ముందుగా అల్లు రామలింగయ్య కూతురు సురేఖ చిరంజీవిని పెళ్లి చేసుకోవాల్సింది కాదట. మరో స్టార్ హీరో ని పెళ్లి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇక చిరంజీవీ ని పెళ్లి చేసుకుందట సురేఖ. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందిని చూస్తూ ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చారు. ఇక పెద్ద వారిని గౌరవిస్తూ క్రమశిక్షణగా ఉంటూ స్టార్ హీరోగా మారారు. అయితే చిరంజీవికి తన కూతురుని భార్యగా పంపాలని అల్లు రామలింగయ్యా ఎంతగానో ఆశపడ్డాడు. అనుకున్నట్లుగానే సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశాడు.
అయితే చిరంజీవి కంటే ముందే మరో స్టార్ హీరోకు సురేఖని ఇచ్చి పెళ్లి చేయాలని రామలింగయ్య నిర్ణయించుకున్నాడట. ఇక ఆ హీరోకి కూడా ఈ విషయం చెప్పాడట. ఇక హీరో కూడా సురేఖను పెళ్లి చేసుకునేందుకు ఓకే అనడంతో.. చివరికి ముహూర్తం పెట్టిద్దామని ఇద్దరు జాతకాలను జ్యోతిష్యుడికి చూపించాడట. అయితే వీరి జాతకాలు చూసిన జ్యోతిష్యుడు ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా కలిసి ఉండరు అని బాంబు పేల్చాడట. దీంతో ఇక పెళ్లిపై తన ఆలోచనలను విరమించుకున్న అల్లు రామలింగయ్య.. స్టార్ హీరోకి అర్థమయ్యేటట్టు ఈ విషయం చెప్పాడట. ఆ తర్వాత ఇక ఇండస్ట్రీలో ఎంతో అనుకోగా క్రమశిక్షణతో ఉంటూ ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి తన కూతురు సురేఖను ఇచ్చి చివరికి పెళ్లి చేశారు.