ఈరోజు తెలుగు సినిమా షూటింగ్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన కొంత మంది క్రేజీ హీరోలకు సంబంధించిన క్రేజీ మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. అవి ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసు కుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందు తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్ లో 13 వ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం హైదరాబా ద్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ పై సాంగ్ ను చిత్రీకరిస్తుంది .

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శ్రీలంక లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం వెంకటేష్ పై శ్రీలంక లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పోలీస్ అకాడమీలో జరుగుతోంది. ఇక్కడ బాలకృష్ణ మరియు ఇతరులపై ఈ మూవీ బృందం షూటింగ్ ను నిర్వహిస్తుంది.

నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం ప్రస్తుతం ఊటీ లో నాని మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృనాల్ ఠాకూర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: