సంయుక్త చేతిలో ఆ ఒక్కటే..?
హిట్ కాంబో కాబట్టి సంయుక్త కళ్యాణ్ రాం సినిమాకు లక్కీ అనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు భీంలా నాయక్ నుంచి సం యుక్త నటిస్తున్న సినిమాలన్నీ సక్సెస్ అవడం తో ఆమె టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది. అయితే చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నా సంయుక్తకి ఆశించిన ఆఫర్లు రావట్లేదు. ఈ ఇయర్ ఆల్రెడీ సాయి ధరం తేజ్ తో విరూపాక్ష హిట్ అందుకున్న సంయుక్త ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.
బహుశా అమ్మడు తన దగ్గరకు వచ్చిన కథలను కాదని అంటుందో లేక నిజంగానే ఆమెకు అవకాశాలు రావట్లేదో తెలియదు కానీ సంయుక్త ఫ్యాన్స్ మాత్రం ఆమెను ఇంకా చాలా సినిమాల్లో చూడాలని ఉత్సాహపడుతున్నారు. సంయుక్త మీనన్ మాత్రం సెలెక్టెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని అనుకుంటుంది. డెవిల్ తర్వాత సంయుక్త నెక్స్ట్ సినిమా ఏది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సక్సెస్ లు వస్తున్నా సరే సం యుక్తకు ఛాన్స్ లు రాకపోవడం పట్ల ఆమె ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. మరి అమ్మడు సినిమాల విషయంలో స్పీడ్ పెంచితే బెటర్ అని అనుకుంటున్నారు. డెవిల్ కూడా హిట్ పడితే మాత్రం సంయుక్త క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది.