శివాజీ తో గొడవకు దిగిన శోభా శెట్టి.. ఏమైందంటే..?
నామినేషన్ లో భాగంగా ఒకరికొకరు నామినేట్ చేసుకుంటూ పూర్తిస్థాయిలో గొడవ పడుతున్న నేపథ్యంలో శోభా శెట్టి , శివాజీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను నామినేట్ చేసింది అందుకే నేను ఆమెను నామినేట్ చేస్తున్నాను అంటూ శివాజీ తెలిపాడు. దీంతో కోపగించుకున్న శోభా శెట్టి ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు అంటూ శోభా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. కొంతమంది టీం గా ఆడుతున్నారని శివాజీ ఆమెను ఉద్దేశించి ఆడారు.అయితే ఎవరూ జట్టుగా ఆడడం లేదని ఖండించింది. ఇక నేను కూడా ఆర్టిస్టునే అని శోభా శెట్టి ఖండించడంతో అందుకే శివాజీ కాస్త వ్యంగ్యంగా అన్నాడు.
ఇంప్రెస్ చేయడం ఏంటి అని శోభ కోపంగా ప్రశ్నించింది. దానికి శివాజీ పాయింట్ అదే కదా.. గేమ్ లో ఇంప్రెస్ చేసావ్ అన్నాను అంటూ మళ్ళీ కౌంటర్ వేశాడు శివాజీ. ఇలా ఇద్దరు కూడా చాలా సమయం గొడవ పడ్డారు. ఆ తర్వాత మీరు చెబితే నేను హౌస్ నుండి వెళ్లను బిగ్ బాస్ చెబితే హౌస్ నుంచి వెళ్తాను అంటూ గొడవకు ముగింపు పలికింది. మొత్తానికైతే ఈ ఆసక్తికర విషయాలు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వైరల్ గా మారుతున్నాయి.