ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలామందికి జెనీలియా అంటే తెలియకపోవచ్చు కానీ బొమ్మరిల్లు హాసిని అంటే తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది జెనీలియా. తెలుగులో స్టార్ హీరోలతో నటించి మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో మొట్టమొదటి సినిమా చేసిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేసిన జెనీలియా ఇద్దరు పిల్లలకి తల్లయింది.
అనంతరం వారి పిల్లల బాగోగులు చూసుకోవడానికి తన టైం ను కేటాయిస్తోంది. పిల్లలు స్కూల్ స్కూల్ వెళ్లే వయసు రావడంతో జెనీలియా రితీష్ ఇద్దరు కలిసి మన మజిలీ సినిమాని రీమేక్ చేశారు. ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో జెనీలియా రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే జెనీలియా బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది అని భావించిన చాలామంది ఆమె మూడోసారి ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలని ప్రచారం చేస్తున్నారు.
అయితే ఆ పుకార్లను జెనీలియా అబద్ధ రితీష్ కొట్టి పారేశారు. జెనీలియా గర్భవతిగా ఉందా అని అడిగే ప్రశ్నలకు స్పందిస్తూ మరో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా తనకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దురదృష్టవశాత్తు ఈ వార్త అవాస్తవం అని తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. 2012లో వివాహం చేసుకున్న వీరిద్దరి కి రియాన్ రహిల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. జెనీలియా ఇటీవల ఒక ఈవెంట్ లో తన దుస్తులను తన పొట్టపై మళ్లీమళ్లీ సర్దుకునే ప్రయత్నంలో ఈ ఫోటోలు బయటకి రావడంతో ఆమె మళ్లీ గర్భవతి అయింది అన్న పుకార్లు మొదలయ్యాయి..!!