మహిళల కోసం ఉచితంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ.. థియేటర్ లిస్ట్ ఇదే..!!
ముఖ్యంగా USA లో ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. విడుదలైన మూడు రోజులలోనే వన్ మిలియన్ డాలర్ ను సైతం కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించడంతో తాజాగా చిత్ర బృంద ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే మహిళల కోసం గురువారం ప్రత్యేకంగా షో వేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి అనుష్క స్వయంక ఒక మీడియా ద్వారానే తెలియజేయడం జరిగింది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతూ..
ఆంధ్ర అండ్ తెలంగాణలో కొన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైన షో వేయబోతున్నట్లు తెలియజేశారు. అందుకు సంబంధించిన థియేటర్ లిస్టును కూడా రిలీజ్ చేసింది. క ఈ సినిమా విజయంతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు.. మొదట పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లో నటించిన నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ వెంటనే జాతి రత్నాలు సినిమాతో మంచి పాపులారిటీ అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాతో ఒక్కసారిగా బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకున్నారు నవీన్ పోలిశెట్టి. అనుష్క షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.