ప్రభాస్ - కృష్ణంరాజుకి మధ్య తేడా ఇదే- సీనియర్ నటి తులసి..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ తులసి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో సినిమాలలో స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా, వదినగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికి నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటించి మెప్పించిన తులసి దాదాపు 700 పైగా చిత్రాలలో నటించి సుమారుగా ఐదు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా నిన్నటి తరం, నేటితరం హీరో హీరోయిన్లను దగ్గర నుండి చూసిన ఈమె అందులో భాగంగానే కృష్ణంరాజు , రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య ఉన్న తేడా ని వెల్లడించింది. తులసి మాట్లాడుతూ ఇండస్ట్రీలో రెండు తరాల హీరోలతో కలిసి కంటిన్యూగా సినిమాలు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.  కృష్ణ గారి సినిమాలలో నటించి .. ఇప్పుడు వారి కొడుకు మహేష్ బాబు సినిమాలో నటించడం.. అలాగే కృష్ణంరాజు గారితో నటించి ఇప్పుడు ఆయన వారసుడు ప్రభాస్ సినిమాలలో నటించడం అప్పటి పెద్ద హీరోలతో చేసి ఇప్పుడు వాళ్ల పిల్లలతో సినిమాలలో చేయడం నాకు కలిగిన మహాభాగ్యం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా కృష్ణంరాజు గారు నాతో ఎలా మాట్లాడుతారో ప్రభాస్ కూడా ఇప్పుడు అలాగే మాట్లాడుతారు. కాకపోతే ప్రభాస్ డార్లింగ్ అంటాడు.. సో నా దృష్టిలో రాజు అంటే ప్రభాస్ మాత్రమే.. కృష్ణంరాజు తర్వాత నేను చూసిన రాజు ప్రభాస్ అంటూ కృష్ణంరాజు, ప్రభాస్ ల మధ్య ఉన్న తేడాలను, వాళ్ళ బాండింగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది తులసి. ఇకపోతే ప్రభాస్ తో డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కి తల్లిగా నటించిన తులసి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లిగా కూడా నటించి మెప్పించింది. ఏది ఏమైనా తులసి ప్రభాస్ గురించి చెప్పిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: