నాలో దాన్ని చూసి అవకాశం ఇచ్చారంటున్నా శోభితా ధూళిపాళ్ళ...!!

murali krishna
శోభిత ధూళిపాళ…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల 'పొన్నియిన్‌ సెల్వన్‌2'లో కనిపించి ఎంతగానో అలరించింది శోభితా . తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఈ భామ రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు కొదవ ఏమి లేదు.మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2 లో తార పాత్రలో అద్భుతం గా నటించింది ఈ బ్యూటీ.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ బ్యూటీ. నేను ఎప్పుడూ తెరపై కనిపించాలి. నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రనీ నేను అస్సలు ఒప్పుకోను. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు అయితే ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన నచ్చిన పాత్రలను ఎంచుకుంటాను అని అన్నారు శోభిత. పాత్రల ఎంపికే తప్ప అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే.. కరణ్‌ జోహార్‌, ఫరాఖాన్‌ లాంటి గొప్ప దర్శకులతో నేను కలిసి పని చేస్తాను.


ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాలనే మనసు పెట్టి చేస్తాను.కమర్షియల్‌గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్‌ 'మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2'లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నా అని ఆమె అన్నారు.అలాగే స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారు పొన్నియిన్‌ సెల్వన్‌ లో మంచి ప్రాధాన్యం ఉన్న  పాత్రను ఇచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను..ఆ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉంటాయి అని శోభిత తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: