బాబీ దర్శకత్వంలో బాలయ్య చిత్రం.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ భామ?
ఈ చిత్రాన్ని 2024 ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ డ్రామా గా తేరకేక్కబోతోందని సమాచారం. ఈ చిత్రానికి సుమారు 100 కోట్లు బడ్జెట్ ను ప్లాన్ చేశారట నిర్మాతలు. ప్రతి సినిమా తోను తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న బాలయ్యను చూసి సంతోషిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా విషయంలో బాల కృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కథ విషయంలోనూ, కథనం విషయంలోనూ బాగా ఇన్వొల్వె అయ్యారట.
బాల కృష్ణ తన సినిమాలను పండుగ సమయంలో రిలీస్ చెయ్యడానికి ఇష్టపడతారు. మరి ఈ చిత్రం కూడా 2024 సంక్రాంతికి విడుదల అవుతుందేమో వేచి చూడాలి. ఇక ఫాన్స్ విషయానికొస్తే బాలయ్య ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నందమూరి హీరోల కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ చిత్రం వస్తే నందమూరి ఫాన్స్ కు పండగే. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. భవిష్యత్తులో బాలయ్య ఎటువంటి సినిమాలు చేస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.