"రామన్న యూత్" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమా లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నటువంటి అభయ్ నవీన్ తాజాగా రామన్న యూత్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాకి ఈయనే స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో తాగుబోతు రమేష్ , అనిల్ జిల్లా , శ్రీకాంత్ అయ్యంగార్ , విష్ణు ఓ ఐ , బన్నీ అభిరన్ ముఖ్య పాత్రల్లో నటించగా ... కమ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఫ్రెండ్లీ ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం సభ్యులు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లాంజ్ ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తున్నారు. 


అలాగే ఈ మూవీ బృందం వారు నిర్వహిస్తున్న ప్రమోషన్ లకి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అభయ్ ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకొని నటుడిగా ... దర్శకుడిగా ఏ స్థాయి క్రేజ్ ను అందుకుంటాడో తెలియాలి అంటే సెప్టెంబర్ 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: