అట్లీ నన్ను మోసం చేసాడు అంటున్న సౌత్ బ్యూటీ...!!
ఓ భేటీలో ప్రియమణి మాట్లాడుతూ..." జవాన్ డైరెక్టర్ అట్లీ అని తెలియగానే ఓకే అన్నాను. ఒకసారి జూమ్ కాల్లో అట్లీ, ఆర్య నాతో మాట్లాడారు. అట్లీ తన ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేసి ఆర్య వెళ్లిపోయాడు. నేను జవాన్‌లో నటిస్తున్నాను అని వార్త రాగానే ఏదో స్పెషల్ సాంగ్ అయ్యింటుందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ దర్శకుడు అట్లీ నన్ను ఓ విషయంలో మోసం చేశాడు. అప్పట్లో జవాన్ మూవీ అనౌన్స్ కాగానే తమిళ వర్షన్లో స్టార్ యాక్టర్ విజయ్ అతిథి పాత్రలో నటిస్తాడని , తెలుగు వెర్షన్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడని ప్రచారం హోరెత్తింది. ఈ క్రమంలో విజయ్ ఈ మూవీలో నటిస్తున్నారా..? అని నేను అట్లీని అడిగాను. అవును అని అన్నాడు. నాకు విజయ్‌తో ఒక్క సీన్లో అయినా నటించే ఛాన్స్ ఇవ్వమని కోరాను. అయితే చివరి వరకూ తెలియదు అట్లీ నన్ను మోసం చేశాడని. నిజానికి ఈ మూవీలో విజయ్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ నటించలేదు" అని ప్రియమణి చెప్పింది.