బుల్లితెర యాంకర్
రష్మి గౌతమ్ తాజాగా సనాతన ధర్మం గురించి చేస్తున్న ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో
నెటిజన్స్
రష్మీ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో చాలామంది
రష్మీ ని ట్రోల్ చేస్తున్నారు. ఆమె మాట్లాడిన దానికి ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు.' స్కిన్ షో, ఎక్స్పోజింగ్ చేయడం కూడా సనాతన ధర్మమేనా? అయితే ఇటీవల బాయ్స్ హాస్టల్ మూవీలో చాలా విషయాలు తెలుసుకున్నామని' ఓ నెటిజన్ రష్మీకి కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ కి
రష్మీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.' వాదన గెలవలేనప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని'
నెటిజన్స్ పై అసహనం వ్యక్తం చేసింది.
ఈ మేరకు
రష్మీ రిప్లై ఇస్తూ.." ఇది సంస్కృతిలో ఒక భాగం. మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు? దండయాత్రలు జరగడానికి ముందు మేము ఎలా దుస్తులు ధరించామో దయచేసి తెలుసుకోవాలి. హిందూ బాలికలు ఎలా ధరించారు లేదా ఏమీ ధరించారు అనేది తెలుసుకోవాలి. మేము ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే. వాటికి హిందూ మతం లేదా సనాతన ధర్మంతో సంబంధం లేదు" అంటూ
రష్మీ పేర్కొంది. దీంతో సనాతన ధర్మం గురించి మాట్లాడే హీరోయిన్లు ముందుగా స్కిన్ షో చేయడం మానేయాలి అనే వ్యాఖ్యను వెంటనే నెటిజన్ తోసిపుచ్చాడు.
హిందూ మతం సనాతన ధర్మానికి చెందిన చాలామంది మద్దతు ధరలు
రష్మీ రిప్లైకి మద్దతుగా నిలిచారు. నిజానికి ఈ సనాతన ధర్మం వివాదం
తమిళ హీరో ఉదయనిది
స్టాలిన్ వ్యాఖ్యలతో మొదలైంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయనిది
స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.." సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిది. డెంగ్యూ, మలేరియా,
కరోనా వంటి రోగాలు ఎంత ప్రమాదకరమో, సనాతన ధర్మం కూడా అంతే ప్రమాదం. దాన్ని వెంటనే నిర్మించాలి" అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి