మోహన్ లాల్ తో జతకట్టబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్....!!

murali krishna
నటి ప్రియమణి వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ భామ వరుసగా సినిమాలు అలాగే వెబ్‌సిరీస్‌లతో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ ఎంతో బిజీబిజీగా ఉంటోంది.ఈ భామ తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ఇందులో ప్రియమణి హీరో షారుక్‌ ఖాన్ కు సహాయం చేసే లక్ష్మి అనే పాత్రలో నటించి మెప్పించిందీ. గతంలో  షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది ప్రియమణి.జవాన్‌ సినిమా తో మరొక సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకుందీ ఈ సీనియర్‌ హీరోయిన్‌.

అయితే ప్రియమణి జవాన్ సినిమా ఇచ్చిన జోష్ తో మరో సూపర్‌స్టార్‌ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తుంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్నటిస్తున్న 'నేరు' సినిమాలో ప్రియమణి ముఖ్య పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఇప్పటికే 'నెరు' షూటింగ్ ప్రారంభించినట్లు ఇందులో ఆమె పేర్కొంది. 'నేరు' చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మోహన్ లాల్ సూపర్ డూపర్ హిట్ మూవీ 'దృశ్యం', 'దృశ్యం 2' చిత్రాలకు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్‌, జీతు కాంబినేషన్‌లో వస్తోన్న ఐదో చిత్రం' నేరు'. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ లాయర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

 అలాగే ప్రియమణి కూడా లాయర్ పాత్రలో నటిస్తుందని సమాచారం.ఈ ఏడాది నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి మెప్పించింది.. ప్రస్తుతం ఈ భామ కొటేషన్‌ గ్యాంగ్‌, ఖైమారా, మైదాన్‌ వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇలా ప్రియమణి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ అలాగే కథను మలుపు తిప్పే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: