కాబోయే భార్యకి అవకాశాలు లేకపోవడంతో అలాంటి పనులు చేస్తున్న వరుణ్ తేజ్..!?

Anilkumar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల బంధం మిస్టర్ సినిమా నుండి కొనసాగుతుంది. ఎప్పుడైతే మిస్టర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుండి వీరిద్దరి ప్రేమ వ్యవహారం మొదలైందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా ఆ బంధాన్ని దాచిపెడుతూ వచ్చారు వీరిద్దరూ. అయితే ఇంట్లో వాళ్ళు వీరి బంధాన్ని ఒప్పుకున్నప్పటికీ బయట ఈ విషయాన్ని చెప్పకుండా రహస్యంగా ఉంచారు. దానితోపాటు ఆ సినిమా మొదలైనప్పటి నుండి ఎంగేజ్మెంట్ జరిగే వరకు వారి మధ్య రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు.


అయితే ఒకవేళ అప్పుడే వీరిద్దరి మధ్య ఉన్న లవ్వును బయట పెడితే కొన్ని కారణాల వల్ల విరి మధ్య గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి అని అందుకే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడకుండా జాగ్రత్తగా ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఈ విషయాన్ని ఇప్పటివరకు బయట పెట్టకుండా చాలా రహస్యంగా ఉంచి వారి బంధాన్ని మరింత బలపరుచుకున్నారు అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోని తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.


అదేంటంటే కాబోయే భార్య లావణ్య త్రిపాటికి అవకాశాలు లేకపోవడంతో దర్శక నిర్మాతలను అడిగిమరీ వరుణ్ తేజ్ తనకి సినిమాల్లో అవకాశాలను కల్పిస్తున్నాడు అన్న టాక్ నడుస్తోంది. అయితే అసలు విషయం ఏంటంటే వరుణ్ అతిథి రావు హైదరి లావణ్య త్రిపాఠి కలిసి నటించిన అంతరిక్షం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో మొదట్లో అది రావు తర్వాత వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. కానీ అప్పట్లో వరుణ్ తన కాబోయే భార్య మీద ప్రేమతో తనకి అప్పుడు అవకాశాలు లేకపోవడంతో ఈ సినిమాలో తనకి అవకాశం రావాలని డైరెక్టర్ కి చెప్పి మరి అవకాశాన్ని ఇప్పించాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: