ఏంటి.. కృతి శెట్టి.. మెగా కోడలు అవ్వబోతుందా?

praveen
సాధారణంగా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు వచ్చిన తక్కువ సమయంలో ఒక వెలుగు గలుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా డెబ్యూ మూవీ తోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుసగా అవకాశాలు అనుకుంటూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన హీరోయిన్లు కొంతమంది రెండు మూడు సినిమాలకు పరిమితమై ఆ తర్వాత అవకాశాలు దక్కించుకోక ఇండస్ట్రీలో కనుమరుగైతే.. ఇంకొంతమంది హీరోయిన్లు మాత్రం ఇక ఇండస్ట్రీలో పాతుకుపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్రముకు బేబమ్మగా పరిచయమైంది కృతి శెట్టి.

 అయితే ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత ఈ అమ్మడు వరుసగా అవకాశాలు అందుకుంది. ఇక ఈమె నటించిన  సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. కానీ ఆ తర్వాత మాత్రం కథల ఎంపికలో తడబడిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో ఇక అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పుడు కృతి శెట్టికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. త్వరలోనే ఈ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కపోతుందట.

 అయితే వరుడు ఎవరో కాదు ఒక బడా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో అని టాక్ వినిపిస్తుంది. ఉప్పెన సినిమాతో వైష్ణవి తేజ్ కు కృతికి  మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందని చిన్న టాక్ కూడా బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారూ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. అయితే ఈ విషయాన్ని కృతి తన పేరెంట్స్ కు చెప్పడంతో వాళ్లు కూడా ఒప్పుకున్నారట. మరి ఇది ఎంతవరకు నిజం తెలియాలి అంటే ఎవరో ఒకరు అఫీషియల్ ప్రకటన చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: