జవాన్ చిత్రానికి సిరి హనుమంతు అందుకున్న రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?
ఈ పాన్ ఇండియా చిత్రం లో ఒక్క తెలుగు నటుడు గాని, నటి గాని లేరే అన్న లోటుని సిరి తీర్చేసింది. ఈ చిత్రంలో సిరి, హీరో షా రుఖ్ ఖాన్ పక్కనే ఉంటుంది. ఆమెకు ఎటువంటి డైలాగ్స్ లేవు ఈ చిత్రంలో. షా రుఖ్ పోషించిన జైలర్ ఆజాద్ పాత్రకు సుబోర్డినేట్ గా నటించింది సిరి. ఐతే ఈ చిత్రంలో సిరిని ఎవ్వరు గమనించి ఉండరు. కానీ గమనించిన వారు మాత్రం ఖచ్చితంగా సర్ప్రైస్ అయ్యి ఉంటారు. షా రుఖ్ లాంటి సువర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా మంది నటుల జీవిత ఆశయం. అలాంటిది సిరి కి ఈ అవకాశం ఎలా దక్కిందో అర్ధం కాక, ఆమె చాలా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో ఆమె కనిపించే సీన్ ని ఫోటో తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఆమె అభిమానులు. ఐతే సిరి ఈ చిత్రానికి సిరి అందుకున్న పారితోషకం కూడా భారీగానే ఉన్నట్టు సమాచారం. ఆమెకు ఈ సినిమాలో ఎటువంటి డైలాగ్స్ లేకపోయినప్పటికీ, ఆమె ఏకంగా 20 లక్షల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకుందని సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.