జవాన్ సినిమా కోసం దీపిక ఎంత తీసుకుందో తెలుసా..?

Divya
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటించిన కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే నటించింది. అలాగే మరొక హీరోయిన్ ప్రియమణి కూడా ఇందులో నటించింది నటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సినిమాలో దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఎట్టకేలకు ఈ వార్తల పైన దీపిక పదుకొనే స్పందించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా దీపిక మాట్లాడుతూ జవాన్ సినిమా కోసం తాను ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలియజేసింది. కేవలం కథ నచ్చడంతో ఈ సినిమాలో భాగమయ్యానని కూడా తెలియజేసింది. షారుక్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధంగా మంచి స్నేహితులమని కూడా తెలిపింది.. జవాన్ సినిమా విషయంలో తన రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కూడా తెలిపింది. రణబీర్ సింగ్ హీరోగా నటించిన 83, సర్కస్ సినిమాలలో సైతం దీపిక అతిధి పాత్రలో కూడా నటించింది. ఆ సినిమాలో కూడా కథలు నచ్చడంతోనే గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది.
షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన దీపిక ఇందులో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్, పఠన్, చెన్నై ఎక్స్ప్రెస్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి బాలీవుడ్లో విజయవంతమైన జోడీలలో వీరి జోడి కూడా ఒకటని చెప్పవచ్చు.. అంతేకాకుండా తనను వెండితెరకు పరిచయం చేసిన షారుక్ కంటే తనకి చాలా గౌరవమని అందుకే జవాన్ సినిమా కోసం అడగగానే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: