ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ సినిమా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితం పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... శ్రీ లీల , మీనాక్షి చౌదరి మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.


ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా పనులు పూర్తి కాగానే మహేష్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 29 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ ఈ మూవీ తర్వాత సినిమాను కూడా ఇప్పటికే సెట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో మహేష్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మూవీ తర్వాత సందీప్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సందీప్ , రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న యానిమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: