సెన్సేషనల్ రికార్డును నమోదు చేసుకున్న ఆర్య "టెడ్డి" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఆర్య ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి తమిళ సింక్ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఆర్య చాలా సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన వరుడు సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకున్నాడు. ఇక అలాగే ఈయన తాను నటించిన అనేక తమిళ సినిమాలను కూడా తెలుగులో విడుదల చేసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ యువ నటుడు టెడ్డీ అనే ఓ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.


ఈ మూవీ లో సయేష హీరోయిన్ గా నటించగా శక్తి సుందర్ రాజన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 2021 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ తాజాగా యూట్యూబ్ లో రికార్డు ను నమోదు చేసుకుంది. ఈ మూవీ ని కొంత కాలం క్రితమే గోల్డ్ మైన్స్ ఛానల్ వారు తమ యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేయగా ఈ మూవీ కి కేవలం నెల రోజుల్లోనే 50 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి.


 ఇలా ఈ మూవీ హిందీ వర్షన్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఆర్య వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఈయన సర్పట్టా పరంపర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నేరుగా "ఓ టి టి" లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: