ఆ చిన్నారి చాలా కాస్ట్లీ అంటున్న నెటిజన్స్....!!

murali krishna
సినిమా అయినా సీరియల్ అయినా చైల్డ్ ఆర్టిస్టుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పాలి. ఇలా ఎంతోమంది బుల్లితెర సీరియల్స్ లోను అలాగే వెండితెర సినిమాల లోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారందరూ కూడా పెరిగి పెద్దయిన తర్వాత హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదు సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్గా కూడా రావడానికి సిద్ధమవుతున్నటువంటి వారిలో సారా అర్జున్ ఒకరు.

తమిళనాడుకు చెందిన ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఐదు సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టినటువంటి సారా అర్జున్ దాదాపు తెలుగు తమిళ హిందీ భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె ఒక సినిమాలో నటించాలి అంటే లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.అందానికి అందం నటనకు నటనతో అందరిని మెప్పించినటువంటి సారా అర్జున్ తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం 19 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఈమె త్వరలోనే హీరోయిన్గా రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూ దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఆస్తులు పోగు చేశారని తెలుస్తోంది. ఇక ఈమె సినిమాలలో నటించాలి అంటే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం తెలియడంతో ఈ చిన్నారి చాలా కాస్ట్లీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: