రెడ్ కలర్ డ్రెస్లో సైమా అవార్డ్స్ తో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సీరియల్ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. అందులో భాగంగా ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీత రామం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా ... టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
 

ఇకపోతే ఈ సినిమాను వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ముఖ్యంగా ఈ మూవీ లోని నటనకు గాను మృణాల్ కి సూపర్ క్రేజ్ లభించింది. దానితో తాజాగా ఈ నటికి ఈ సినిమా లోని నటన కు గాని సైమా అవార్డు కూడా దక్కింది. ఇకపోతే తాజాగా ఈ అవార్డు వేడుకకు ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది.
 

ఇకపోతే అవార్డు ఫంక్షన్ అనంతరం ఈ ముద్దు గుమ్మ తనకు వచ్చిన అవార్డు లను చేతిలో పట్టుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు లో నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమాలోను ... విజయ్ దేవరకొండ , పరుశురామ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలోను హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: