ఎట్టకేలకు హనుమాన్ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర బృందం..!
వాస్తవానికి ఈ సినిమా ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. దీంతో ఎట్టకేలకు చిత్ర బృందం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను బాక్సాఫీస్ వద్ద బరిలో దిగడానికి సిద్ధమయ్యిందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక జనవరి 12 2023 శుక్రవారం రోజున థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది ఈ సినిమా. ఇకపోతే సినిమా విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు. ఏదో తొందరపడి సినిమా తీశాము కదా విడుదల చేయాలి అని కాకుండా నిదానంగా ఒక్కో పని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో నాలుగు నెలల్లో అంటే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రాబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగడమే కాదు ఏకంగా 5 చిత్రాలకు పోటీ ఇవ్వబోతోంది. ఈ లిస్టులో ప్రభాస్ ప్రాజెక్ట్ కే ,మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, పవన్ కళ్యాణ్ ఓ జి తో పాటు చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చే సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఇన్ని పెద్ద సినిమాల మధ్య హనుమాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.