కుమార్తె ఆత్మహత్య.. విజయ్ కామెంట్స్ వైరల్?

Purushottham Vinay
మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకొని నటుడు ఇంకా డైరెక్టర్ గా మెప్పించిన  విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్న మీరాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.దీంతో విజయ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన కేవలం విజయ్ కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్‌ను కూడా షాక్‌కు గురి చేసింది. కాగా.. మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరలవుతోంది.



గతంలో విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో రిలేషన్‌పై ఆయన పలు సూచనలు చేశారు. తాను ఎప్పుడు కూడా తన కుమార్తెను చదువు విషయంలో అసలు బలవంతం చేయలేదని అన్నారు. పిల్లల చదువుల గురించి ఇంటి దగ్గర ఎప్పుడు చర్చించలేదని ఆయన తెలిపారు. కానీ పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలని విజయ్ సూచించారు.ఇంకా విజయ్ మాట్లాడుతూ..'నేను నా కూతురిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని నేను చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే నేను వదిలేశా. ఇక చదవు విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తా. తను చదవాలనుకుంటే చదవచ్చు. అది తన ఇష్టం. నేను చదువు విషయంలో పిల్లలను ఏనాడు బలవంతం చేయను.' అని అన్నారు.



మనం పనిలో ఎంత బిజీగా ఉ‍న్నా సరే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని విజయ్ ఆంటోని సూచించారు. అందువల్ల పేరేంట్స్, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందన్నారు. బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు. ఆయన కూతురి మరణ వార్త విని తెలుగు అభిమానులు కూడా ఎంతో బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: