భారీ అనౌన్స్మెంట్ కు సిద్ధమైన జక్కన్న.. మహేష్ సినిమా గురించి కాదు?

praveen
దర్శకదీరుడు రాజమౌళి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన సినిమాలతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితుడుగా మారిపోయాడు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ హిట్లను సాధిస్తున్న ఏకైక డైరెక్టర్ గా కూడాభారతీయ చలనచిత్ర పరిశ్రమలో హవా నడిపిస్తూ ఉన్నాడు. బాహుబలి సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి అన్ని రికార్డులను కూడా తిరగ రాశాడు అని చెప్పాలి.


 అయితే ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే తర్వాత సినిమాపై అటు అభిమానుల్లో కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. కాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళి సినిమా తీయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా రాజమౌళి ఒక భారీ ప్రకటన చేయబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. భారీ ప్రకటన అనగానే అందరూ మహేష్ బాబు తో సినిమా గురించి అని అనుకుంటున్నారు అందరూ. కానీ మహేష్ సినిమా గురించి కాదట


 ఏకంగా జక్కన్న నిర్మాతగా అవతారమెత్తి కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడట. ఇందుకు సంబంధించిన ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు అనేది తెలుస్తోంది. భారతీయ సినిమా పుట్టుక ఎదుగుదల ఎలా సాగింది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఇక ఈ సినిమాలో కనిపించబోతున్నారట. కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా భాగమవుతారట. భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతుందని సినీ విశ్లేషకుడు మనోబాల విజయ బాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: