ఆ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంపూ....!!

murali krishna
సంపూర్ణేష్‌బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి..అయితే తన మొదటి సినిమా హృదయకాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం అంతగా అందుకోలేకపోయాడు.లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్‌ను కూడా కన్ఫామ్ చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసారు.సంపూర్ణేష్‌బాబు తలపై కిరీటం ఉండటం, అందులో కొంతమంది నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేస్తోన్నట్లుగా డిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది.


మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహా, నరేష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకోలీవుడ్ రీమేక్ అని తెలుస్తుంది.. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా అనే సినిమా మంచి విజయం సాధించింది.బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తుది నామినేషన్స్లో ఆ సినిమా కు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా  గెలుచుకున్నది. అయితే సూపర్ హిట్ అయిన మండేలా సినిమా ఆధారంగానే మార్టిన్ లూథర్ కింగ్ రూపొందుతోన్నట్లు సమాచారం. పంచాయతీ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.మరి ఈ సినిమాతో సంపూ మరో హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: