ఆ విషయంలో అగ్ర హీరోలతో పోటీ పడిన యంగ్ హీరో...!!
శోభన్ బాబు హీరో గా వచ్చిన సినిమాల్లో లక్ష్మి నివాసం, పంతాలు పట్టింపులు అనే రెండు సినిమాలు కూడా 1968 జులై 19 వ తేదీన రిలీజ్ అయ్యాయి.ఇక కృష్ణ హీరో గా వచ్చిన ఇద్దరు దొంగలే, యుద్ధం సినిమాలు రెండు కూడా 1984 జనవరి 14 న రిలీజ్ అయ్యాయి.చిరంజీవి హీరో గా వచ్చిన కాళీ, తాతయ్య ప్రేమ లీలలు సినిమాలు రెండు కూడా 1980 సెప్టెంబర్ 19 వ తేదీన రిలీజ్ అయ్యాయి.అలాగే పట్నం వచ్చిన పతివ్రతలు,టింగు రంగడు 1982 అక్టోబర్ 1 వ తేదీన రిలీజ్ అయ్యాయి.ఇక బాలకృష్ణ హీరో గా వచ్చిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు కూడా 1993 సెప్టెంబర్ 3 వ తేదీన రిలీజ్ అయ్యాయి.ఇక నాని హీరో గా వచ్చిన జండా పై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు కూడా రెండు ఒకే రోజు అంటే 2015 మార్చ్ 21 వ తేదీన రిలీజ్ అయ్యాయి..ఈ రోజుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ చేయడమే కష్టం అవుతుంటే, అప్పట్లో వాళ్ళు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…అయితే ఈ జనరేషన్ లో ఉన్న నాని సినిమాలు రెండు ఒకే రోజు ఎలా వచ్చాయి అది ఎలా సాధ్యం అయింది అంటే జండా పై కపిరాజు సినిమా అప్పటికి ఎప్పుడో సినిమా పూర్తి అయి పోయి రిలీజ్ కి కూడా రెడీ గా ఉంది. కానీ కొన్ని వివాదాల వల్ల ఈ సినిమా రిలీజ్ కొంచం లెట్ అవుతూ వచ్చింది.అందువల్లే ఈ సినిమా ఎవడే సుబ్రమణ్యం తో పాటు గా రిలీజ్ అయింది.అయితే ఎవడే సుబ్రహ్మణ్యం హిట్ అయితే జండా పై కపిరాజు ప్లాప్ అయింది…